మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు song
మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు
నీ కళ్ళలోని కన్నీరు తేరి చూశాడు
నీ గుండెలోని వేదన తెలుసుకున్నాడు
నువ్వే యేసుకి కావాలని చేతులు చాపాడు
నేస్తమా నేస్తమా ఓ నేస్తమా
||మనసెరిగిన||
1.ఎన్నో యేళ్ళు పాపం చేసి విసిగిపోయావు
ఎన్నో నిందలు అవమానాలు నీవు పొందావు
నీ కన్నవాళ్ళే మరిచినా స్నేహితులే విడచినా
యేసు నిన్ను విడువడు ఎడబాయడు
||నేస్తమా||
2.ఈ లోకమే స్థిరమని అనుకున్నావు
లోకపు ఆశలే ప్రియమని ఎంచుకున్నావు
ఈ లోకమే అశాశ్వతం పరలోకమే శాశ్వతం
ప్రభు యేసుని చెంతకు పరుగిడి రమ్ము
||నేస్తమా||
Comments
Post a Comment