నీ మాట సంపూర్ణ స్వస్థత గలది


 నీ మాట సంపూర్ణ స్వస్థత గలది
   అది నీ సేవకునికి ప్రియమైనది (2)
   నీ మాట సంపూర్ణ స్వస్థత గలది
   అది నీ సేవకునికి ప్రాణమైనది
   నోరార నీ మాటను పలుకనీ యేసయ్యా
   మనసారా నీ బాటను నడువనీ యేసయ్యా
   ||నీ మాట||
1.నీ చేయి చాపుమని నీవు పలుకగా
    ఊచచేయి గలవాడు బాగుపడెనుగా (2)
    నీ పరుపును ఎత్తికొని నీవు నడువుమనగా
    బలహీనుడు బలమొంది లేచి నడిచెగా
    ||నీ మాట||
2.అమ్మ నీ బలహీనత విడిచిపోయెననగా
    నడుము ఒంగిపోయిన స్త్రీ లేచి నిలిచెగా (2)
    లాజరు బయటకు రమ్మని నీవు పలుకగా
    మృతుడైనవాడు బ్రతికి బయటికొచ్చెగా
    ||నీ మాట||

Comments

Popular posts from this blog

మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు song