Posts

మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు song

   మనసెరిగిన దేవుడు నీతో ఉన్నాడు    నీ కళ్ళలోని కన్నీరు తేరి చూశాడు    నీ గుండెలోని వేదన తెలుసుకున్నాడు    నువ్వే యేసుకి కావాలని చేతులు చాపాడు    నేస్తమా నేస్తమా ఓ నేస్తమా     ||మనసెరిగిన|| 1.ఎన్నో యేళ్ళు పాపం చేసి విసిగిపోయావు     ఎన్నో నిందలు అవమానాలు నీవు పొందావు     నీ కన్నవాళ్ళే మరిచినా స్నేహితులే విడచినా    యేసు నిన్ను  విడువడు ఎడబాయడు     ||నేస్తమా|| 2.ఈ లోకమే స్థిరమని అనుకున్నావు     లోకపు ఆశలే ప్రియమని ఎంచుకున్నావు     ఈ లోకమే అశాశ్వతం పరలోకమే శాశ్వతం     ప్రభు యేసుని చెంతకు పరుగిడి రమ్ము     ||నేస్తమా|| 

నీ మాట సంపూర్ణ స్వస్థత గలది

 నీ మాట సంపూర్ణ స్వస్థత గలది    అది నీ సేవకునికి ప్రియమైనది (2)    నీ మాట సంపూర్ణ స్వస్థత గలది    అది నీ సేవకునికి ప్రాణమైనది    నోరార నీ మాటను పలుకనీ యేసయ్యా    మనసారా నీ బాటను నడువనీ యేసయ్యా    ||నీ మాట|| 1.నీ చేయి చాపుమని నీవు పలుకగా     ఊచచేయి గలవాడు బాగుపడెనుగా (2)     నీ పరుపును ఎత్తికొని నీవు నడువుమనగా     బలహీనుడు బలమొంది లేచి నడిచెగా     ||నీ మాట|| 2.అమ్మ నీ బలహీనత విడిచిపోయెననగా     నడుము ఒంగిపోయిన స్త్రీ లేచి నిలిచెగా (2)     లాజరు బయటకు రమ్మని నీవు పలుకగా     మృతుడైనవాడు బ్రతికి బయటికొచ్చెగా     ||నీ మాట||

నీ వాక్యమే నన్ను బ్రతికించెను

   నీ వాక్యమే నన్ను బ్రతికించెను    బాధలలో నెమ్మది నిచ్చెను    కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా    వాక్యమైయున్న యేసు వందనమయ్యా 1.జిగటగల ఊభినుండి లేవనెత్తెను    సమతలమగు భూమిపై నన్ను నిలిపెను    నా పాదములకు దీపమాయెను    సత్యమైన మార్గములో నడుపుచుండెను (2)    ||నీ వాక్యమే|| 2.శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై    యుద్దమునకు సిద్దమనసు నిచ్చుచున్నది    అపవాది వేయుచున్న అగ్ని భాణములను    ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది (2)    ||నీ వాక్యమే|| 3.పాల వంటిది జుంటె తేనె వంటిది    నా జిహ్వకు మహా మధురమైనది    మేలిమి బంగారుకంటే మిన్నయైనది    రత్న రాశులకన్న కోరతగినది (2)    ||నీ వాక్యమే||

ఇది కోతకు సమయం

ఇది కోతకు సమయం =    పనివారి తరుణం ప్రార్ధన చేయుదమా    పైరును చూచెదమా-పంటను కోయుదమా{2} 1.కోతెంతో విస్తారమాయెనే-    కోసెడి పనివారు కొదువాయెనే{2}    ప్రభుయేసు నిధులన్ని -నిలువాయెనే {2}    ||ఇది|| 2.సంఘమా మౌనము దాల్చకుమా-    కోసెడి పనిలోన పాల్గొందుమా{2}    యజమాని నిధులన్ని మీకేగదా {2}    ||ఇది|| 3.శ్రమలేని ఫలితంబు మీకీయగా    వలదంచు వెనుదీసి విడిపోదువా{2}    జీవార్ధ ఫలములను భుజియింతమా{2}    ||ఇది||

ఎంతటి వాడను నేను యేసయ్యా

ఎంతటి వాడను నేను యేసయ్యా     కొంతైనా యోగ్యుడను కానయ్యా (2)     ఇంతగ నను హెచ్చించుటకు     ఈ స్థితిలో నన్నుంచుటకు (2)     ||ఎంతటి|| 1.ఐశ్వర్యము గొప్పతనమును     కలిగించు దేవుడవీవే     హెచ్చించువాడవును     బలమిచ్చువాడవు నీవే (2)     అల్పుడను మంటి పురుగును     నన్ను ప్రేమించినావు     ప్రాణమును నీ సర్వమును     నా కొరకై అర్పించినావు     ||ఎంతటి|| 2.నిను వెంబడించువారిని     నిజముగ సేవించువారిని     నీవుండే స్థలములలో     నిలిచే నీ సేవకుని (2)     ఎంతో ఘనపరచెదవు     ఆశీర్వదించెదవు     శత్రువుల కంటె ఎత్తుగా     అతని తలను పైకెత్తెదవు     ||ఎంతటి|| 3.వినయముగల మనుష్యులను     వర్దిల్లజేసెదవు    గర్విష్టుల గర్వమునణచి     గద్దె నుండి దించెదవు (2)     మాదు ఆశ్రయ దుర్గమా    మేమంతా నీ వారమే    మా శైలము మా కేడెమా   ...